వాలంటీర్ల సేవలు మరువలేనివి….
1 min readవచ్చే ఎన్నికల్లో కూడా గెలిచేదే నేనే
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : సూర్యుడు ఉదయించక ముందే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వాలంటీర్ల సేవలు మరువలేనివి అని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రాలయం లో సంత మార్కెట్ లో ఏర్పాటు చేసిన వాలంటీర్ల కు ఉత్తమ సేవలు సేవ వజ్ర, సేవ మిత్ర, సేవా రత్న అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల పై చాలా నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా, నన్ను ఎమ్మెల్యే గా గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మరల ముఖ్యమంత్రి అయితే వాలంటీర్ల ను పర్మినెంటు చేయడం లేక జీతాలు పెంచడం జరుగుతోందని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో కి వస్తే వాలంటీర్ల ను తొలగించి, సంక్షేమ పథకాలు తీసివేయడం జరుగుతుందని తెలిపారు. నా నియోజకవర్గ ప్రజలు, మీరు ఉన్నంత వరకు నాలుగో సారి ఎమ్మెల్యే గా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు ఎవరు నిలబడిన విజయం నాదే అన్నారు. టిడిపి కి అభ్యర్థి ఎవరనేది వాళ్ల కే గ్యారంటీ లేదు ఇక ప్రజలకు గ్యారంటీ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం వాలంటీర్ల కు శాలువ కప్పి పురస్కారాలు ప్రదానం చేశారు . ఈ కార్యక్రమంలో వైకాపా మండల ఇన్ చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ గోపినాథ్, మండల స్థాయి అధికారులు, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, బొంబాయి శివ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.