అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి
1 min read
– లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ అఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్, అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కర్నూలు గ్రేటర్ క్లబ్, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ లయన్స్ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ విలువలను కాపాడేందుకు విశేషంగా కృషి చేశారన్నారు.ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి లయన్స్ క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం పోరాటం చేసారని,విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాల కోసం ఆయన నిరంతరం శ్రమించారని,నిరాడంబర జీవనం, నిజాయితీ, ప్రజాసేవ బాబు జగ్జీవన్ రామ్ వ వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచాయన్నారు.దేశ అభివృద్ధిలో ఆయన అందించిన సేవలు భావితరాలకు ఆదర్శప్రాయంగా ఉంటాయని,యువత బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ సభ్యులు, అలయన్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ కర్నూల్ సభ్యులు, లక్ష్మీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

