ఉద్యోగుల్లాగే సినీ పరిశ్రమ పరిస్థితి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉద్యోగుల మాదిరే.. సినీ పరిశ్రమ పరిస్థితి తయారవుతోందని సీపీఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. ఫిల్మ్ చాంబర్‌తో మాత్రమే ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. వ్యక్తులతో చర్చలు జరిపితే రావణ కాష్టం మాదిరిగా సమస్య రగులుతూనే ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పాలసీని ఆపాలని సీపీఐ నారాయణ అన్నారు. ఉద్యోగుల్లో విభజన తీసుకొచ్చి సమస్య పరిష్కారమైనట్టు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు.