నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే…
1 min read
36 లక్షల హెల్త్ సెంటర్ కు భూమి పూజ..
నందికొట్కూరు న్యూస్ నేడు: పాములపాడు మండలం ఇస్కాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 20 క్యూసెక్కుల 2 వేల ఎకరాలకు సాగు,తాగునీటిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా పూజలు చేసి నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వేంపెంట’లో రెడేళ్ల నమ్మకం-అభివృద్ధి వేంపెంట గ్రామంలో’రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’లో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు.
తరిగోపుల’లో హెల్త్ సెంటర్ కు భూమి పూజ , జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో హెల్త్ సెంటర్ కు 15వ ఆర్థిక సంఘం 36 లక్షల నిధులతో ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో అబ్జర్వర్ వెంకటశివుడు,నాయకులు, ప్రభుత్వ అధికారులు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.


