NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీకృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

1 min read

ప్రతి ఒక్కరికి భక్తితోనే ముక్తి సాధ్యం

టిడిపి నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లాలోని  రాయచోటి నియోజకవర్గం గాలివీడు గ్రామం అరవీటివాండ్ల పల్లిలో శ్రీకృష్ణ నగర్ నందు నూతన ఆలయం నిర్మాణ దాత కొంగా రమణ ఆహ్వానం మేరకు  శ్రీ కృష్ణ పరమాత్ముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో  మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి భక్తితోనే ముక్తి సాధ్యమవుతుందన్నారు . ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రసాద్ బాబు గారికి గాలివీడు మండలం తెలుగుదేశం నాయకులుగ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టి  గజమాలతో స్వాగతం పలికారు.ఆడపడుచులు మంగళ హారతులతో స్వాగతం పలికి  శాలువా కప్పి సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు .ఈ కార్యక్రమంలో మోడం చెన్నయ్య, పురం రామాంజులు, ధనంజయ నాయుడు, కొంగ గణేష్, సాయి, శ్రీకాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి, మిట్టె నాయక్, శేఖర్ రెడ్డి, సత్యనారాయణ, గుడుసాబ్, రాజన్న,దేవపట్ల జనార్దన్, భాస్కర్ యాదవ్,నాగేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు

About Author