వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి..
1 min read
చెన్నూరు, న్యూస్ నేడు: వక్బ్ సవరణ బిల్లు ముస్లిం మైనార్టీల కు మేలు చేయకపోగా వక్బ్ఆస్తులను ప్రభుత్వాలే స్వాధీనం చేసుకునే విధంగా ఉందని దీనిని వెంటనే రద్దు చేయాలని మైనార్టీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు, శుక్రవారం చెన్నూరులో , ఖిల్లా, షాహి మసీదు పెద్దలతో ప్రజలతోపాటు ముస్లిం మైనారిటీ నేతలతో కలసి శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ నేతలు వారిష్, అశ్రత్, సుభాని, మంజూరు అహ్మద్ లు మాట్లాడుతూ పూర్వపు రోజులలో స్వచ్ఛమైన మనసు గల దాతలు, మైనార్టీ పెద్దలు ఎంతోమంది లాభ పేక్ష లేకుండా ఏమి ఆశించకుండా తమ ఆస్తులను మసీదులు, ఈద్గాలు, దర్గాలు, స్మశానాలు, అందించడం జరిగిందన్నారు. వారందరూ సహృదయంతో అందించిన ఆస్తులు వల్ల పేద మైనార్టీ పిల్లలు బాగా చదువుకోవడం తోపాటు, వారందరికీ కూడా అక్షరాస్యత, బ్రతుకుతెరువు పనులు కల్పించు కోవడం, పేదరిక నిర్మూలన ఇలా పలు రకాలుగా ఉపయోగపడాలనేదే ముఖ్య ఉద్దేశ్యంతో ఇచ్చినటువంటి వక్బ్ ఆస్తులను నేటి ప్రభుత్వాలు వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడి మరింత మేలు చేయాల్సింది పోయి దాతలు అందించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్లచట్టమైన వక్బ్ బిల్లు రద్దు చేసి వక్బ్ ఆస్తులను కాపాడాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం వారు తాసిల్దార్ సరస్వతికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు అన్వర్, షబ్బీర్, ఫక్రుద్దీన్, జహీరుద్దీన్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.