స్టాక్ మార్కెట్లను వెంటాడుతోన్న యుద్ధం.. భారీ నష్టాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాల వైపుగా కదులుతున్నాయి. సూచీల్లో అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణం ఉక్రెయిన్, రష్యా యుద్ధమే. ఈ రెండు దేశాల మధ్య ఒక దశ శాంతి చర్చలు జరిగినప్పటికీ.. అవి ఓ కొలిక్కి రాలేదు. మరోసారి చర్చలకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే రష్యా తన సైన్యాన్ని కీవ్ నగరం వైపు తరలిస్తోంది. ఇప్పటికే ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అనిశ్చితితో క్రూడ్ ఆయిల్ ధర ఆకాశాన్నంటింది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడ పెరిగాయి. ఈ అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. 1 గంట సమయంలో సెన్సెక్స్ 916 పాయింట్ల నష్టంతో 55,330 వద్ద, నిఫ్టీ 222 పాయింట్ల నష్టంతో 17571 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.