ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
1 min read
పల్లెవెలుగు, వెబ్ ప్యాపిలి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపిపి గోకుల్ లక్ష్మీ, మాజీ జడ్పిటిసి దిలీప్ చక్రవర్తిలు అన్నారు. మండల పరిధిలోని జలదుర్గం గ్రామంలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికి రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. ప్రజాసంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడ ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజల కోసం పని చేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి అందుతున్న ప్రభుత్వ పథకాలను వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ హేమంత్ రెడ్డి , గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గోన్నారు.