PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దెయ్యాలు ఉన్నాయి .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐఐటీ మండి కొత్త డైరెక్ట‌ర్, ప్రొఫెస‌ర్ ల‌క్ష్మీధ‌ర్ బెహ‌రా దెయ్యాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. మంత్రాలు, శ్లోకాల‌తో వాటిని త‌రిమికొట్టాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా 1993 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో చెన్నైలోని తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టాత్మలు ఏడిపించాయని చెప్పాడు. తాను అప్పుడు తన స్నేహితుడికి ఇంటికి వెళ్లి ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని పఠించడంతో పాటు “భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ఒక ఐఐటీ ప్రోఫెసర్‌ దెయ్యాలు గురించి ఆసక్తి కరంగా చెబుతున్నా వీడియో ఒకటి యూట్యూబ్‌లో “లెర్న్ గీత లైవ్ గీత” పేరుతో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఆసక్తికరమైన వీడియోగా వైరల్‌ అవుతోంది.

About Author