NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావులేదు

1 min read

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు కొనసాగించాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు :ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.ప్రతి నెల నిర్వహించే తనిఖీల్లో భాగంగా బుధవారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్‌లో ఈవీఎం గోదాములను  కలెక్టర్ పరిశీలించారు. గోదాముల తాళాలు, సీళ్ల పటిష్టత, సీసీటీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.పోలీసు లాగ్‌బుక్‌ను పరిశీలించి విధుల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచాలని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో సబ్ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *