NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు

1 min read

రచ్చమరి లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

మంత్రాలయం న్యూస్ నేడు :  రాబోయే ఎన్నికల్లో ఎవరైనా సరే అల్లర్లు సృష్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దస్తగిరి బాబు హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని రచ్చమర్రి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంత్రాలయం సిఐ దస్తగిరి బాబు అధ్వర్యంలో  మాధవరం, పెద్దకడుబూరు, కోసిగి, మంత్రాలయం  ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బందితో కలిసి మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రచ్చుమర్రి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అల్లర్లకు పాల్పడే వ్యక్తులు, రౌడీషీటర్లు అనుమానిత వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేసి వారి కార్యకలాపాలను పరిశీలించారు. అలాగే వాహనాలను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం అనుమతులు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు శాంతిభద్రతలను కాపాడాలని, వర్గవిభేదాలు  వ్యక్తిగత గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని, ఎన్నికలు ప్రశాంతంగా  సజావుగా జరిగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు .ఎన్నికల సమయంలో ప్రజా శాంతికి భంగం కలిగించేలా లేదా శాంతిభద్రతల సమస్యలు సృష్టించేలా ఎవరైనా వ్యవహరిస్తే, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ లో మంత్రాలయం ఎస్సై మల్లికార్జున, మాధవరం ఎస్సై విజయ కుమార్, పెద్దకడుబూరు, కోసిగి ఎస్సై లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *