రాబోయే వేసవిలో ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
1 min read
గోదావరి జలాల చెరువును పరిశీలించిన నగరపాల సంస్థ కో-ఆప్షన్ సభ్యులు
ఎస్.యం.ఆర్ పెదబాబు, కమిషనర్ ఎ భానుప్రతాప్
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: రాబోయే వేసవికాలంలో నగర ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడకుండా తీసుకునే చర్యల్లో భాగంగా దెందులూరు లో ఉన్న గోదావరి జలాల చెరువును నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,కమిషనర్ఏ.భాను ప్రతాప్ శనివారం ఉదయం పరిశీలించారు. గోదావరి జలాలు ఏలూరు కాలువ ద్వారా పూర్తిస్థాయిలో రాకపోవడం కారణంగా దెందులూరు లో ఉన్న చెరువులోని నీటి నిల్వల తగ్గాయి. దీంతో గత నెల రోజులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూర్జహాన్ పెదబాబు మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులతోప్రతిరోజు రివ్యూ నిర్వహిస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్ లో మంచినీటి సమస్యపై ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూర్జహాన్ పెదబాబు ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప్ దెందులూరు చెరువు వద్దకు వెళ్లి గోదావరి కాలువ ద్వారా వస్తున్న నీటి జలాలను,పంపింగ్ మోటార్ల పనితీరును పరిశీలించారు. అనంతరం చెరువులో నిల్వ ఉన్న గోదావరి జలాలు నీటి సామర్థ్యాన్ని పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు ఉన్నారు.
