ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి కనపరచాలి
1 min read– ఎం ఎస్ పి జిల్లా కన్వీనర్ ఎస్ సుభాష్ చంద్ర మాదిగ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ విషయంపై బి.ఎస్.పి అదినేత్రి మాయావతి స్పష్టమైన తన వైఖరిని తెలియజేయాలని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు ఎస్ సుభాష్ చంద్ర గారు డిమాండ్ చేశారు. పత్తికొండ నియోజకవర్గం పత్తికొండలో ఆదివారం మధ్యాహ్నం ఎం ఎస్ పి అండ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎం ఎస్ పి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎస్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వవలసిన బాధ్యత ఉందని, అలాగే సామాజిక న్యాయం పేరు మీద ఉత్తరప్రదేశ్లో బహుజన బహుజనులు బిడ్డగా నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవిని పొందిన మాయావతి సామాజిక న్యాయ డిమాండ్ తో 28 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరుకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో ఆమె తమ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఎం ఎస్ పి కర్నూలు జిల్లా కన్వీనర్ సుభాష్ చంద్ర గారు సూటిగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ముత్యాల ఈశ్వరయ్య, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు ముత్యాల మనోహర్, మాట్లాడుతూ, సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు మాయావతి గారు మద్దతిస్తే ఎస్సీ వర్గీకరణ తప్పకుండా జరుగుతుందని, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు పరంగా, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా పరంగా సమానమైన వాటా వస్తుందని వారన్నారు.ఈ సమావేశం లో ఎం ఎస్ పి గౌరవ అధ్యక్షులు మునుస్వామి, ఎం ఎస్ పి జిల్లా నాయకులు రాముడు తిరుపాల్ ఠాగూర్ పాల్గొన్నారుు.