NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లలో అగ్నిప్ర‌మాదాల‌కు కార‌ణాలు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాల్లో బ్యాటరీ సెల్స్‌, మాడ్యుల్స్‌లో లోపాల కారణంగా జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదాలు జరిగిన చోట వివిధ కంపెనీలకు చెందిన స్కూటర్ల నుంచి శాంపిల్స్‌ తీసుకుని ఈ దర్యాప్తు చేపట్టారు. ఒకినావా ప్రమాదానికి సంబంధించి సెల్స్‌, బ్యాటరీ మాడ్యుల్స్‌ కారణంగా తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ అగ్నిప్రమాదానికి సంబంధించి బ్యాటరీ కేసింగ్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇక దేశవ్యాప్తంగా భారీగా అమ్ముడైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్టుగా తెలిసింది, అయితే దీనిపై ఓలా స్పందిస్తూ.. ఓలా బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో ఏ సమస్యా లేదని కానీ ఐసోలేటెడ్‌ థర్మల్‌ ఇష్యూ కారణంగా ఓలా స్కూటర్లు ఫైర్‌ యాక్సిడెంట్‌కి గురైనట్టుగా తెలపింది.

                            

About Author