డ్రగ్స్ సరఫరా చేసేది వారే !
1 min readపల్లెవెలుగువెబ్ : బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ ఘటన పై టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్ నిర్వాహకులు జాతీయ పార్టీ నాయకులని, పబ్ ఓనర్ అభిషేక్ బీజేపీ నేత ఉప్పల శారద కొడుకని తెలిపారు.ఈ ఘటనతో బీజేపీ, కాంగ్రెస్ నేతల చిల్లర వ్యవహారాలు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. డ్రగ్స్ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహితులేనని, కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని పేర్లు బయటకు వస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్ సప్లయిర్స్‌తో పాటు వాడకందార్లను అరెస్టు చేస్తున్నామని, మాకు చిత్తశుద్ధి లేకుంటే ఇంత మందిని అరెస్టు చేస్తామా అని ప్రశ్నించారు.