ఆగస్టులోనే థర్డ్ వేవ్
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆగస్టు నెలలోనే దేశంలో థర్డ్ వేవ్ మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. క్రమంగా పెరుగుతూ .. అక్టోబర్ లో తారాస్థాయికి చేరుతుందని అన్నారు. కరోన రెండో దశతో పోలీస్తే దీని ప్రభావం కొంత తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. గతంలో ఈ పరిశోధకులు రెండో దశ విజృంభణ ఫై ఖచ్చితమైన లెక్కలు కట్టారు. విద్యాసాగర్ (హైదరాబాద ఐఐటీ), మణింద్ర అగర్వాల్ (కాన్పూర్ ఐఐటీ) నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. థర్డ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని చెప్పారు. పరిస్థితి చేయి దాటితే 1.5 లక్షలు ఉంటుందని తెలిపారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే కేరళ, మహారాష్ట్రాలు పరిస్థితి మార్చేశాయని అన్నారు. గణిత నమూన సహాయంతో పరిశోధకలు ఈ అంచనా వేశారు.