కేసీఆర్ జాతీయ పార్టీ పై చంద్రబాబు స్పందన ఇదే !
1 min readపల్లెవెలుగువెబ్: టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్… పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తన పార్టీ పేరును మార్చి పార్టీకి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించిన వైనంపై పెద్ద చర్చే నడుస్తోంది. అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలోనూ… దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పరిణామంపై చర్చ నడుస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీపై మీ స్పందనేమిటని మీడియా ఆయనను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు నోరు విప్పని చంద్రబాబు… మీడియా ప్రతినిధులను అలా చూస్తూ ఓ నవ్వు నవ్వేసి వెళ్లిపోయారు. వెరసి చిరునవ్వుతోనే ఆయన కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించారు.