ప్రధాన్ మంత్రి జన్ ధన్ లూట్ యోజన ఇది !
1 min readపల్లెవెలుగువెబ్ : రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ”ప్రధాన్ మంత్రి జన్ థన్ లూట్ యోజన” అనే శీర్షికతో గ్రాఫిక్‌తో కూడిన ఓ ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు. 2014 మేలో బైకు, కారు, ట్రాక్టర్, కారు వంటి వాహనాల్లో ఇంధనం ఫుల్ ట్యాంక్ ధరను, ఇప్పటి ధరతో ఇందులో పోల్చారు. రాహుల్ విడుదల చేసిన గ్రాఫిక్ లెక్కల ప్రకారం 2014లో స్కూటర్/బైక్ ఫుల్ ట్యాంక్ ఇంధనం ధర రూ.714. అది ప్రస్తుతం రూ.1,038కి చేరింది. కారు ఫుట్‌ట్యాంక్ ధర అప్పట్లో రూ.2.856, ప్రస్తుతం రూ.4,141. ట్రాక్టర్ ఫుల్ ట్యాంక్ ఇంధనం ధరం అప్పట్లో రూ.2,749, ప్రస్తుతం రూ.4,563. దీనిని ”ప్రధాన్ మంత్రి జన్ థన్ లూట్ యోజన”గా రాహుల్ ఆ ట్వీట్‌లో అభివర్ణించారు.