బరువు తగ్గకపోవడానికి ఇదే కారణం !
1 min readపల్లెవెలుగు వెబ్ : బరువు పెరిగాక తగ్గాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎన్ని వ్యాయామాలు చేసినా.. డైట్ ప్లానింగ్ పాటించినా కొందరు బరువు తగ్గరు. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడ వెంటాడుతాయి. వీలైనంత వరకు బరువును అదుపులో ఉంచుకోవడమే అత్యుత్తమం. బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బరువు తగ్గకపోవడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం.
- కంటికి నిద్ర లేకపోవడం
నిద్రపోకపోతే శరీరంలో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కంటి నిండా సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడ బరువు పెరుగుతారని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. ప్రతి రోజు ఒకే సమాయానికి నిద్రపోవడం అలవరుచుకోవాలి. - సరిగా తినకపోవడం
తింటే బరువు పెరుగుతారు. తినకపోతే కూడ బరువు పెరుగుతారా ? అని ప్రశ్న వేయవచ్చు. ఇది నిజం. మీరు సరిగా తినకపోతే మీ మెదుడు ఇప్పటికే నిల్వ ఉన్న కొవ్వులను సరిగా ఖర్చు చేయదు. జీవక్రియలు మందగిస్తాయి. దీంతో కేలరీలు ఖర్చుకావు. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు ఆరోగ్యకరమైన, పోషక ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. - అతిగా తినడం
బరువు తగ్గాలనుకుంటే కంట్రోల్డ్ గా ఆహారం తీసుకోవాలి. ఆకలిని పెంచే జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. వీటికి ప్రత్యామ్నాయంగా నీరు తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారం మితంగా తీసుకోవాలి. - పిండి పదార్థాలు
కార్బో హైడ్రేట్స్ అధికంగా ఉండే బియ్యం, చక్కెర, బ్రెడ్ లాంటివి తక్కువగా తీసుకోవాలి. వీటి నుంచి అందే పోషకాలు తక్కువ. ఎక్కువ మొత్తంలో గ్లైసిమిక్ లభ్యమవుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచి బరువు తగ్గకుండా అడ్డుకుంటుంది. వాటికి ప్రత్యామ్నాయంను ఎంచుకోవాలి.