PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందువుల పై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి….

1 min read

– కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ……

పల్లెవెలుగు వెబ్  న్యూఢిల్లీ : హర్యానాలోని మేవాత్‌లో నిన్నటి రోజున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల ఈరోజు ( బుధవారం,3/8/23) ఉ 11:00 గం.లకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందుగా గాంధీ విగ్రహం ముందు జరిగిన విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలో  జరిగిన శోభాయాత్ర పై దాడిచేసిన ఇస్లాం జిహాదీ మూకలను కఠినంగా శిక్షించాలని నిర్వహించిన “నిరసన ధర్నా” లో కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో  సోమవారం నాడు భక్తులు మేవాత్‌లోని మహాభారత కాలం నాటి ఐదు దేవాలయాలను సందర్శిస్తూ శంకరుని ఆశీస్సులు పొందుతారని తెలిపారు.నిన్న దాదాపు 20-25 వేల మంది ఈ యాత్రలో పాల్గొన్నారు.. యాత్ర ప్రారంభమై 15 నిమిషాలు కూడా కాకముందే దుండగులు వారిపై బుల్లెట్లు వర్షం కురిపిస్తూ, రాళ్లు రువ్వడం, వాహనాలు దహనం చేయడం ప్రారంభించారు. పరిస్థితి అదుపు తప్పడం గమనించిన భక్తులు వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా, వెనుక నుంచి రాళ్ల వర్షం కురిపిస్తూ వారిపై పెట్రోలు బాంబులు విసిరారు. అతి కష్టం మీద కొంత మంది భక్తులను రక్షించి నల్హాద్ మహాదేవ్ ఆలయానికి తిరిగి తీసుకురాగలిగాము. ఆ గుడి ముందుకు కూడా అల్లరి మూకలు వచ్చేశాయి. కార్లు, బస్సులు, ఇతర వాహనాలకు నిప్పుపెట్టి, ఎదురుగా ఎవరు కనిపించినా తూటాలు పేల్చారు. ఇద్దరికి బుల్లెట్లు తగిలాయి. దాదాపు అన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రావడంతో పోలీసులను చూసిన దుండగులు పారిపోయి కొండలపైకి ఎక్కి ఆలయంలో తలదాచుకున్న మహిళలు, చిన్నారులు, ఇతర భక్తులపై మూడు వైపుల నుంచి కాల్పులు జరిపారు.ఒక భక్తుడు చనిపోవడం జరిగింది. మరికొందరికి బుల్లెట్లు కూడా తగిలాయని దీనిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని వెంఠనే సదరు అల్లరిమూకలను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి మాట్లాడుతూ మేవాత్ మొత్తం మినీ పాకిస్థాన్‌గా మారిన దృశ్యాన్ని నిన్నటి రోజున చూశాము. అన్ని వైపుల నుండి ముట్టడి జరిగింది, దుండగులు యాత్రికులను నలువైపుల నుండి చుట్టుముట్టారు.   కొన్నిచోట్ల దేవాలయాల్లో, కొన్నిచోట్ల పోలీసు ఔట్‌పోస్టుల్లో ఆశ్రయం పొందగా ఆ దేవాలయాలు, ఇతర ఔట్‌పోస్టులపై కూడా దాడులు చేశారు.ఈ అల్లర్లను ప్రేరేపించిన వ్యక్తులే ఈ ఘటనకు బాధ్యులని, వారి ప్రోద్బలంతో ముహర్రం మరియు రామ నవమి రోజున దాడులు జరుగుతున్నాయని  ఆరోపించారు. ఇంకా ఎంత మంది చనిపోయారో నిర్ధారణ చేయాల్సి ఉంది , పోలీసు యంత్రాంగం నుండి కూడా దీనికి సంబంధించి సరైన గణాంకాలు అందుబాటులో లేవు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కానీ నిన్న నోహ్‌లో డైరెక్ట్ యాక్షన్ తరహా వాతావరణం సృష్టించబడటం తీవ్రమైన ఆత్మపరిశీలనకు సందర్భం. ఏదైనా సాకుతో రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మతపెద్దలకు చెప్పే విషయమేంటంటే ఆత్మహత్యా ధోరణి. చిన్న పిల్లలను ముందుకు తీసుకొచ్చి నిప్పంటించి వారికి ఎలాంటి భవిష్యత్తును సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. మీరు మేవాత్ లో మెజారిటీ అయి ఉండవచ్చు, అంత మాత్రాన మేవాత్ ను  హిందువుల స్మశానవాటికగా మార్చాలనుకుంటున్నారా? ఈ దుర్మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించలేం.హిందూ ధార్మిక యాత్రలపై జరిగిన ఈ క్రూరమైన దాడికి నిరసనగా ఈ “నిరసనధర్నా” నిర్వహిస్తున్నామని అన్నారు.విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ మాట్లాడుతూ ఉగ్రదాడి కారణంగా బజరంగ్‌దళ్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు దారుణంగా హత్యకు గురయ్యారని, సమాజంలోని మరో ఇద్దరు వ్యక్తులు కూడా బలి అయ్యారని, వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. గాయపడిన వారికి రూ.20 లక్షలు ఇవ్వాలని, వాహనాలు, బస్సులు ధ్వంసమైన వారికి పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మేవాత్ ప్రాంతమంతా సీల్ చేసి, కూంబింగ్ చేయాలి మరియు ప్రతి జిహాదీని పట్టుకుని కఠినంగా శిక్షించాలి, అప్పుడే మేవాత్‌లో జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు పోరాడతామని అవసరమైతే ఈ విషయం పై దేశవ్యాప్త ఉద్యమానికి బజరంగ్ దళ్  పిలుపునిస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సందడి మహేష్, జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ సహ కార్యదర్శి గోవిందరాజులు, శివప్రసాద్ జిల్లా బజరంగదళ్ కన్వీనర్ రాజేష్, జిల్లా ప్రసార ప్రచార కన్వీనర్ రామకృష్ణ, నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు, క్రిష్ణమూర్తి,నగర కార్యదర్శి ఈపూరి నాగరాజు,నగర బజరంగ్ దళ్ కన్వీనర్ భగీరథ కో కన్వీనర్ బోయనాగరాజు,అనిల్ సింగ్,ఈశ్వర్, ప్రఖంఢ బజరంగ్ దళ్ కన్వీనర్లు,కార్యకర్తలు భాస్కర్,హరి,జయప్రకాష్,రమేష్,సురేష్  తదితరులు పాల్గొన్నారు.

About Author