PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టులను దూషించిన వారిని కఠినంగా శిక్షించాలి

1 min read

– తహసిల్దార్ కు వినతి పత్రం
– కౌతాళం మండల కేంద్రంలో ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : (ఏపీయూడబ్ల్యుజే) కర్నూల్ జిల్లా కమిటీ పిలుపుమేరకు కౌతాళం తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా నిన్నటి(12.02.2023)రోజు ఆంధ్ర జ్యోతి పత్రిక లో”చెరువు చదునాయే”అనే శీర్షికతో కథనం ప్రచురించడం జరిగింది. ఇందులో ఆలూరు పట్టణం లో మంత్రి గూమ్మనూరు జయరామ్ అనుచరుడు, హస్తం ఉన్నట్టు రాశారు. ఈ వార్త అసత్యం అనిపిస్తే పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ ఆలూరు వైసీపీ మండల కన్వీనర్ వీరేష్ తన అనుచరులతో కూర్చొని ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియా కు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో లో వీరేష్ మాట్లాడుతూ.. *ఇక నుంచి మంత్రి గురించి వార్తలు రాస్తే ఆంధ్ర జ్యోతి ఎండీ రాధకృష్ణను, కర్నూల్ బ్యూరో ఇంచార్జీ కొండప్పను బండికి కట్టుకొని తీసుకువెళతాఅని మాట్లాడడం జరిగింది. నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టుల పై ఇలాంటి వాఖ్యలు చేయడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. వారి మాటలు వింటుంటే భవిష్యత్ లో ఎలాంటి హానీ తలబెడతారో అని అనుమానం కలుగుతోంది. వారి నుంచి ఆంధ్ర జ్యోతి బ్యూరో కొండప్పకు ప్రాణ హాని ఉంది. కనుక దీనిపై క్షేత్ర స్థాయిలో విచారించి వీరేష్ పై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యుజే గా కోరుతున్నాము. అలాగే ఇటీవల కాలం లో నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టు ల పై దాడులు, హెచ్చరికలు పెరిగిపోతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. వాస్తవాలు ప్రపంచానికి తెలియకపోతే భవిష్యత్ లో అక్రమార్కులు, అవినీతి, రౌడీ, గుండా లు రెచ్చి పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు గా మారే అవకాశం ఉంది. కనుక ఆలూరు ఘటనపై క్షేత్ర స్థాయిలో పూర్తిగా విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే జర్నలిస్టుల పై దాడుల నిరోధానికి యాంటీ ఎటాక్ కమిటీ లు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కఠిన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు, విజయ్ మరియు గౌరవ అధ్యక్షులు, మహమ్మద్ ఉపాధ్యక్షులు.శివకుమార్ అంజి, సహాయ కార్యదర్శి సాదిక్ బాషా, మరియు సభ్యులు ముదుకప్ప రాజు,సిద్ధ,రాముడు, హుస్సేని తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author