చిన్నటేకూరు గ్రామంలో తోట పాఠశాల కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో తోట పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన మరియు పశుసంవర్ధక శాఖల అధికారులు రైతులకు ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమగ్ర ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం (IHDP) ప్రాధాన్యతను వివరిస్తూ, ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపు, ఉత్పాదకత మరియు నాణ్యత పెంపు, ఆధునిక సాగు పద్ధతుల ప్రోత్సాహం, నీటి వనరుల సమర్థ వినియోగం మరియు రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యాన రంగ అభివృద్ధికి IHDP దోహదపడుతుందని వివరించారు.అలాగే ఉద్యాన పంటల్లో ఫార్మ్ పాండ్, డ్రిప్ ఇరిగేషన్, వీడ్ మ్యాట్ వంటి నీటి సంరక్షణ మరియు తేమ పరిరక్షణ చర్యల ప్రాముఖ్యతను, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను మరియు ప్రభుత్వ రాయితీ విధానాలను రైతులకు వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీటి కొరతను అధిగమించేందుకు ఈ పద్ధతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితా రెడ్డి , కల్లూరు మండల నాయకులు, కల్లూరు ఎంపీడీవో, వ్యవసాయ అధికారి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యాన అధికారి శ్రీ నరేష్ కుమార్ రెడ్డి, పశువైద్య అధికారి డా. శ్రీకాంత్ రెడ్డి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.


