PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫిబ్రవరి వరకు టైం.. ఏంచేస్తారో చేసుకోండి !

1 min read

పల్లెవెలుగువెబ్ : తన అనర్హత వేటు పై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్ కు టైం ఇస్తున్నానని, ఏం చేస్తారో చేసుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. రాజధాని విషయంలో మోసం చేసిన ప్రభుత్వంపై రైతులు కేసు పెట్టాలని పిలుపునిచ్చారు. 3 రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోర్టులో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీమంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి రావొచ్చన్నారు. వైసీపీ నేత శివశంకర్‌రెడ్డి తరపున ప్రభుత్వ లాయర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి వాదించారని, ప్రభుత్వ తరపు న్యాయవాది పార్టీకి, నాయకుడి తరపున కేసు ఎలా వాదిస్తారు? అని రఘురామ ప్రశ్నించారు.

   

About Author