టిప్పర్లు .. ట్రాక్టర్లు పట్టను కప్పుకొని ఇసుక రవాణా చేయాలి
1 min read– ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమ రాజు సిద్ధవటం ఎస్సై తులసి నాగప్రసాద్
పల్లెవెలుగు, వెబ్ సిద్ధవటం : మంగళవారం నాడు వెహికల్ చెకింగ్ లో భాగంగా ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమ రాజు సిద్ధవటం ఎస్సై తులసి నాగప్రసాద్ మాట్లాడుతూ ఇసుకను రవాణా చేసేటప్పుడు టిప్పర్లు మరియు ట్రాక్టర్లు యజమానులు తప్పనిసరిగా పట్టను కప్పుకొని రవాణా చేయాలని తెలిపారు ఇసుక వాహనాలు టిప్పర్ వాహనాలకు వెనుక వైపు వస్తున్న స్కూటర్స్టులకు మరియు ప్రజలకు గాలి ద్వారా కళ్ళల్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగిందని ఇక పై సంబంధిత శాఖ వారితో మాట్లాడి కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు ఇసుక వాహనాలపై ప్రజల సమస్యలపై మీడియా కూడా మా దృష్టికి తీసుకు వచ్చిందని అన్ని రకాల కోణాల్లో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని సిద్దోటం మండల ఎస్సై నాగ తులసి ప్రసాద్ అన్నారు అలాగే అధిక లోడుతో వెళ్లే వాహనాలు మరియు పట్టకప్పుకోకుండా వెళ్లే వాహనాలపై కఠినమైనటువంటి చర్యలు చేపడతామని తెలిపారు.