PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉగాది లోపు పూర్తి కావాలి : హౌసింగ్ డిఈఈ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగినది.ఈసందర్భంగా హౌసింగ్ డిఈఈ ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలో 355 ఇండ్లు మొదలుపెట్టారని వీటిలో 100 ఇండ్లు పూర్తి అయ్యాయని మిగతా 155 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని ఇవన్నీ కూడా ఉగాదిలోపు ఇండ్లు పూర్తయ్యే విధంగా చూడాలని అంతేకాకుండా గృహ లబ్ది దా రుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి ఉగాదిలోపు ఇండ్లు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.ఉగాది పండుగ రోజున సామూహిక గృహప్రవేశాలు జరపాలని ప్రభుత్వం ఉందని అన్నారు. అన్ని గ్రామ సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు, వీఆర్వోలు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,పొదుపు మరియు హౌసింగ్ సిబ్బంది అందరికి సమీక్షా సమావేశం నిర్వహిచడం జరిగింది. జగనన్న కాలనీ ఇల్లు శాంక్షన్ వచ్చి బేస్మెంట్,గోడలు, స్లాబులు వేసిన వారందరికీ అన్ని బిల్లులూ పడ్డాయి, ఏ ఒక్క గృహ నిర్మాణ లబ్దిదారునికి కూడా బిల్లుకు పెండింగ్ లేవు కావున బిల్లులు పడిన వారందరూ ఫిబ్రవరి చివరి వారంలోగా వారి ఇల్లు పూర్తి చేసుకోవాలి.ఆర్థిక సహాయంగా పొదుపు గ్రూపుల ద్వారా ఋణము పొందవచ్చు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉగాది రోజు అన్ని ఇల్లు గృహ ప్రవేశాలు జరగాలని సూచించారు.గృహనిర్మాణ సామగ్రి సిమెంట్,స్టీలు మరియు ఇసుక అన్నీ అందుబాటులో ఉన్నాయి. లబ్ధిదారులు ఎప్పటికప్పుడు దశల వారీగా ఇల్లు పూర్తి చేసుకుంటూ అన్ని బిల్లులు సకాలంలో పొందాలన్నారు.ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,
తహసీల్దారు సిరాజుద్దీన్ మాట్లాడుతూ ఇంటి పట్టా ఇచ్చింది ఇంటి నిర్మాణం కోసం అని ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కచ్చితంగా ఉండాలని.ఈవిషయం లబ్దిదారులకి ప్రతి ఒక్కరికి తెలియాలని విఆర్వోలకు సూచించారు సమావేశంలో ఈఓఆర్డి ఫక్రుద్దీన్,ఏవో దశరథరామయ్య,ఆర్డబ్ల్యుఎస్ ఏఈ విశ్వనాథ్,ఏపీఎం సుబ్బయ్య,ఇన్చార్జి హౌసింగ్ ఏఈ రమేష్,ఏపీవో జయంతి,సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి,పంచాయతీ కార్యదర్శులు,వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

About Author