NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ పోలీస్​ శాఖకు.. మూడు జాతీయ అవార్డులు

1 min read
అవార్డు అందుకుంటున్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్​

అవార్డు అందుకుంటున్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్​

అభినందించిన సీఎం జగన్​,హోంమంత్రి సుచరిత
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ: దేశంలో ఏ పోలీసు శాఖ అందుకోలేని.. అత్యుత్తమ జాతీయ స్థాయి అవార్డులను ఏపీ పోలీస్​శాఖ అందుకుంది. స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ కు దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనకుగాను ప్రతిష్టాత్మకమైన FICCI ఉత్తమ స్టేట్ అవార్డ్ ను శనివారం ఏపీ పోలీసీశాఖకు అందజేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోని పోలీసు శాఖలో అనేక విభాగాల్లో సాంకేతిక సంస్కరణలు చేపట్టి పోలీసింగ్ మరియ పబ్లిక్ సేఫ్టీలో సమర్థవంతమైన ప్రతిభను కనబర్చిన దేశ డిజిపిలలో ఉత్తమ డిజిపిగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్​ ఐపీఎస్​ అవార్డు దక్కించుకున్నారు. ఇంటెరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ICJS )లోని అన్ని మూల స్తంభాలను అనుసంధానిచడంలో అత్యున్నత ప్రతిభ కనపరిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచినందుకుగాను ఏపీ పోలీసు శాఖ మరో అవార్డు కైవసం చేసుకుంది. వర్చువల్​ విధానం ద్వారా ఒకే రోజు మూడు జాతీయ సంస్థల అవార్డులను అందుకున్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్​ను సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత అభినందించారు.

About Author