దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు నేడే
1 min read
పల్లెవెలుగువెబ్: కర్నూలు జిల్లా దేవరగట్టులో బుధవారం బన్నీ ఉత్సవాలు జరగనున్నాయి. దేవరగట్టు అంటేనే గుర్తుకొచ్చేది దసరా పర్వదినాన అర్ధరాత్రి జరిగే జైత్ర యాత్ర. అదే కర్రల సమరం. మూడు గ్రామాల భక్తులు.. దేవుడిని వశపరుచుకోడానికి తలపడటమే బన్నీ ఉత్సవం. అసురులపై దేవతలు సాధించిన విజయానికి గుర్తుగా జైత్రయాత్ర (బన్నీ) ఉత్సవం జరుపుకుంటున్నారు. త్రేతాయుగం నుంచి ఈ ఆనవాయితీ వస్తోందని దేవరగట్టు సమీప గ్రామాల భక్తుల నమ్మకం. ఈసారి కూడా దసరా సందర్భంగా బన్ని ఉత్సవాన్ని ఘనంగా జరిపాలని నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామాల భక్తులు ఏర్పాట్లు చేశారు.