నేడు, రేపు దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్ల పెన్ డౌన్ కార్యక్రమం..
1 min read– ప్రభుత్వం చేపట్టే ప్రైమ్ 2.0 విధానం సరైనది కాదు..
– రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దస్తావేజుల లేఖర్ల మనుగడను దెబ్బతీసే ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నేడు, రేపు (30, 31) తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు తెలిపారు. ఏలూరులో బుధవారం ఆయన సంఘ సభ్యులతో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దస్తావేజు లేఖర్లు భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రజలకు అవసరమైన అన్ని పనులను చేస్తూ సహాయకారులుగా ఉంటూ వచ్చామని తెలిపారు. ఈ ప్రభుత్వం చేపట్టే ప్రైమ్ 2.0 రిజిస్ట్రేషన్ విధానం వల్ల భవిష్యత్తులో దస్తావేజు లేఖర్ల మరియు స్టాంపు వెండర్ల వ్యవస్థ భవిష్యత్తులో పూర్తిగా కరుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు తదితరులు పాల్గొన్నారు.