NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు రామాపురం క్షేత్రం లో ఉత్తర ద్వార దర్శనం         

1 min read

న్యూస్ నేడు కమలాపురం:  మండలం శ్రీరామాపురం పుణ్యక్షేత్రంలో గురువారం నాడు శ్రీ మహాలక్ష్మీ మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత   ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  కొలువైన శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో గురువారం నాడు ఉత్తర ద్వారం నుంచి దేవదేవులు దర్శనం ఇవ్వనున్నారు .ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతన విగ్రహ మూర్తులైన శ్రీ  మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా మూర్తుల కు ప్రతిరోజు నిత్య కల్యాణాలు జరిగే ఈ ఆలయంలో ప్రతినెల శుక్లపక్ష ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుస్తుంటారు అన్ని ఆలయాలలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారు కానీ ఈ ఆలయంలో సంవత్సరానికి 12 సార్లు ఉత్తర ద్వారం తెరవడం ఒక విశిష్ట ప్రత్యేకత .శ్రీ మహావిష్ణువు మోక్ష అవతారంలో ఈ భువిలో ఎక్కడా లేనివిధంగా  మోక్షమార్గం చూపుతూ వెలిసి ఉండడం ఈ ఆలయంలోని మూలవిరాట్ లోని ప్రత్యేకత .గత 15 సంవత్సరాలుగా ఆలయ పునః ప్రతిష్ట అనంతరం ప్రతినిత్యం హరిహర దేవత మూర్తులైన మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామికి  శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కీ ఒకే వేదికపై నిత్య కళ్యాణం జరగడం ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది .ఉత్తర ద్వారం పైన మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి కొలువై ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తుంటారు  సాయంత్రం 5:30కు మాడవీధులలో గరుడోత్సవం  అనంతరం మహా మంగళహారతి తీర్థ ప్రసాదములు  నిర్వహిస్తారు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల  సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు .ఆలయ ప్రధాన అర్చకులు అన్నపు రాజు  జగదీష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . మాఘమాస శుక్లపక్ష భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్తర ద్వార ప్రవేశం చేసి దేవతామూర్తుల ను  దర్శించుకున్న భక్తాదలకు సకల శుభాలు జరుగుతాయని వేద పండితులు వివరిస్తున్నారు.

About Author