NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయండి

1 min read

సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర,

న్యూస్​ నేడు:   ఫిబ్రవరి 12న సిఐటియు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, పిలుపునిచ్చారు. బుధవారం హోసూరు సమీపంలో ఉన్న వేర్ హౌస్ గోడౌన్ హమాలీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వేర్ హౌస్ హమాలి వర్కర్స్ యూనియన్ మేస్త్రి రామాంజనేయులు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు కర్షకులు సంఘటిత అసంఘటిత కార్మికులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెలో ముఖ్యమైన సమ్మె డిమాండ్లను ఆయన ఈ సందర్భంగా తెలుపుతూ నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. అంగన్వాడీ ఆశా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. రవాణా రంగం మరియు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అసంఘటిత రంగం కార్మికులకు జీవిత భద్రత కల్పించాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం రంగ సంస్థల ప్రైవేటు కరణ పెట్టుబడుల ఉపసంహరణను ఆపాలి. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి. సొంత ఘనలు కేటాయించాలి. ఆదాని కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు పునరుద్ధరించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ తో 12న పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ గోడౌన్ హమాలీలు సుంకన్న, నాగేంద్ర, వంశీ, టి. సహదేవుడు, ఎం. రాజు, హుసేని, మధు, మద్దిలేటి, వై. రమేష్, ఏ. అమాస్, తదితరులు పాల్గొన్నారు.

About Author