టోల్ ప్లాజా… దుంపలగట్టు కు తరలింపు
1 min read
పల్లెవెలుగు,వెబ్ చెన్నూరు: కడప కర్నూల్ జాతీయ రహదారి లో చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కడప కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పాలెం పల్లి టోల్ ప్లాజా ను ఖాజీపేట మండలం దుంపలగట్టు పరిధిలో ఉన్న పాటిమీద పల్లి వద్దకు తరలించారు. నేషనల్ హైవే అధికారులు. రహదారి పనులను పర్యవేక్షిస్తున్న ఎల్ ఎన్ టి కంపెనీ అధికారులు. టోల్ ప్లాజా అధికారులు సిబ్బంది బుధవారం అర్థరాత్రి నుంచి పాటిమీద పల్లి టోల్ ప్లాజా ను హడావుడిగా ప్రారంభించినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. కడప నగర పరిధిలో ఉన్న పాలెం పల్లి టోల్ ప్లాజా కడప నగరానికి దగ్గరగా ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తరలించారు. దుంపలగట్టు వద్ద ఏడాది నుంచి టోల్ ప్లాజా నిర్మాణ పనులు చేపట్టారు ఎట్టకేలకు పనులు పూర్తి కావడంతో టోల్ ప్లాజా ద్వారా వాహన రాకపోకలు సాగిస్తున్నారు. పాలెం పల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా ను మూసివేశారు.