PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరికంటే టాప్‌లో..

1 min read

సినిమా డెస్క్​ : తెలుగు, తమిళ స్టార్ హీరోలందరితోనూ జోడీ కడుతూ సూపర్‌‌ స్పీడ్‌లో దూసుకెళ్తోంది రష్మికా మందాన్న. మరో వైపు నార్త్‌లోనూ తన కెరీర్‌‌ను బిల్డప్‌ చేసుకుంటోంది. బాలీవుడ్‌లో మిషన్ మజ్ను, గుడ్ బై లాంటి ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్‌ లో నటిస్తోంది. టాలీవుడ్‌లో మొన్నటి వరకు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూట్‌లో పాల్గొన్న ఆమె. హిందీ సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడానికి రీసెంట్‌గా ముంబై చెక్కేసింది. ‘లేట్‌ నైట్ షూట్స్‌, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్.. ఇది చాలా దారుణమైన కాంబినేషన్‌’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ కూడా చేసింది. మొత్తానికి టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి, బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి ప్రయాణాలు చేస్తూ బ్యాక్‌ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొని అలసిపోతోందన్నమాట. అయితే రష్మికకి ఉన్న క్రేజ్‌ గురించి తెలియాలంటే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను చూస్తే చాలు తెలిసిపోతుంది. ఎందుకంటే ఏ సౌత్‌ హీరోయిన్‌కీ లేనంతమంది ఫాలోవర్లు ఉన్నారు తనకి. తనకంటే సీనియర్స్ అయిన కాజల్, సమంతలను కూడా క్రాస్‌ చేసి 19.6 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించింది. ఇన్‌స్టాలో సమంత, శ్రుతీహాసన్, పూజా హెగ్డే, తమన్నా లాంటి వారందరికీ ఫాలోయింగ్ బాగానే ఉంది. కానీ రష్మిక వాళ్లందరి కంటే టాప్‌లో ఉండటం విశేషం.

About Author