NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేసీ బ్ర‌ద‌ర్స్ ఇంట్లో ఈడీ త‌నిఖీలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. ఆయ‌న ఇంటితో పాటు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు.

                                   

About Author