టీపిటీ సంస్కృతాన్ని యధావిధిగా కొనసాగించాలి… ఆపస్ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: సంస్కృత భాషను ఈ విద్యా సంవత్సరానికి యధావిధిగా కొనసాగించాలని, తదుపరి ఉపాధ్యాయ సంఘాలు,సంస్కృత ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకు రేపటి విద్యా సంవత్సరానికి నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. శ్రావణ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్.బాలాజీ లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ డి. దేవానంద రెడ్డిని విజయవాడ నందు కలసి వినతిపత్రం ఇచ్చి కోరడం జరిగింది. అంతేకాకుండా గత సమావేశంలో మంత్రిగారు ప్రథమ భాషగా సంస్కృతం ప్రవేశపెడతామన్నారని, అలా కాకుండా ద్వితీయ బాషా గా ఏర్పాటు చేయాలనికోరడం జరిగింది. దానికి డి.దేవానంద రెడ్డి సానుకూలంగా స్పందించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే కమిషనరేట్లో డైరెక్టర్ పి. పార్వతి మేడంని కలిసి రాష్ట్రస్థాయి అవార్డుల సంఖ్య పెంచాలని, గత బదిలీలలో రిలీవర్ రాక ప్రస్తుతము రిలీవ్ అయిన వారిని డిప్యూటేషన్ రద్దుచేసి వారి కొత్త స్థానాల్లో కొనసాగించాలని, పేషియల్ యాప్ నందు అధర్ డ్యూటీ ఫెసిలిటీ కల్పించాలని కోరడం జరిగింది.