‘ట్రేడ్ లైసెన్స్’ ఫేక్ కాల్స్ నమోద్దు
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ రుసుములను చెల్లించాలని కొందరు అజ్ఞాత వ్యక్తులు వాణిజ్య దుకాణదారులకు కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి నుండి వాణిజ్య దుకాణదారులు జాగ్రత్తగా ఉండాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో వాణిజ్య దుకాణదారులు తమకు సుపరిచితుమైన శానిటేషన్ ఇంస్పెక్టర్, శానిటేషన్ సెక్రటరీ, మేస్త్రిల ద్వారా మాత్రమే ట్రేడ్ లైసెన్స్ రుసుములను చెల్లించి, రశీదు పొందాలని సూచించారు. +916304326727 ఈ నెంబర్ లేదా ఇతర ఏ నెంబర్‌తోనైనా అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి, తాము మున్సిపల్ అధికారులమని చెబితే దానిని నమ్మోద్దని, తొందరపడి ఫోన్‌పే, గూగుల్ పే వంటి లావాదేవీలు సైతం చేయోద్దని పేర్కొన్నారు. ఏదైన అటువంటి కాల్స్ వస్తే నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్ధారించుకోవాలని కమిషనర్ దుకాణదారులను కోరారు.