NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం లో… సంప్రదాయ నృత్య ప్రదర్శన

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు:           దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (11.01.2026)  శ్రీ వైష్ణవి నాట్యాలయం, తూర్పుగోదావరి వారిచే  సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి   ఈ  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం  నిర్వహించబడుతున్నది.  ఈ కార్యక్రమములో  వినాయకకౌత్వం, శివపంచాక్షరి,  శివ శంకరం,  నటరాజస్తోత్రం తదితర గీతాలకు లక్ష్మి భవ్యశ్రీ, ప్రవల్లి, కంచెలలిత, సి.ఎస్. మోక్ష తదితర గీతాలకు ప్రియాంక, రామతులసి, అర్చన, ధనుశ్రీ, అంబిక తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.రెండవ కార్యక్రమములో భాగంగా  జీవన వాహిని చారిట్రబుల్ ట్రస్ట్, హైదరాబాద్ వారిచే  సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమములో గణపతి కౌత్వం, గణనాయక, శివపంచాక్షరి,  శివశంభో, జతిస్వరం,  నటరాజకౌత్వం తదితర గీతాలకు  జయంత్‌కుమార్,  మహిమ, కార్తిక్, భాగ్యవత్, శరణ్య తదితరులు నృత్య ప్రదర్శన చేయనున్నారు.    కాగా   ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.           శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

About Author