NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుద్యోగ యువతకు శిక్షణా కోర్సులు

1 min read

ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులములు సహకార ఆర్ధిక సంస్థ లిమిటెడ్  తాడేపల్లి వారి ఆదేశాలు అనుసరించి పదవతరగతి నుండి డిగ్రీ (సైన్స్ ) లేదా బి.టెక్ పూర్తిఅయిన వారికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని షెడ్యూల్డు కులములు నిరుద్యోగ యువతకు ఈ క్రింద తెలిపిన శిక్షణా కోర్సులు వివిధ జిల్లాలలో అందించుటకు చర్యలు తీసుకోన బడుచున్నవని, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.అసిస్టెంటు టేక్నిషియన్ (కంప్యూటరు మరియు పెరిఫెరల్) పదవతరగతి ఉత్తీర్ణత ఏలూరు, కిసాన్ డ్రోను ఆపరేటరు పదవతరగతి ఉత్తీర్ణత అనంతపురం, ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్సు టెక్నీషియన్, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కాకినాడ, ఎలక్ట్రిషియన్- స్మార్ట్ ఎనర్జీ అండ్ ఇట్ ఎనబ్లెడ్ సిస్టంస్ -ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శ్రీకాకుళం, సోలారు పీవీ ఇన్స్టాల్లర్ (సుర్యామిత్రా) ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత (సైన్సు) కడప, ఫార్మా బయోలాజిక్స్ మరియు వైద్యపరికరాలు- ఇంటర్మీడియట్ ఉత్తీర్తత విశాఖపట్నం,ఎ -1 డేటా ఇంజనీరింగు ఎనలిస్ట్ డిగ్రీ (సైన్స్) లేదా బి.టెక్ ) విజయవాడ,జూనియర్ సాఫ్ట్వేర్ డవలపర్ డిగ్రీ (సైన్స్ లేదా బి.టెక్ ) ఒంగోలు,పై తెలిపిన విధముగా వివిధ జిల్లాలు యందు వివిధ శిక్షణలు అందించుటకు నిర్ణయించినారు. పై కోర్సులలో శిక్షణ పొందగోరు అభ్యర్డులకు ఉచిత భోజన వసతి (ఫ్రీ ఫుడ్, అకౌమిడేషన్ ) కల్పించబడును, పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా వసతి కల్పించ బడునని, పై తెలిపిన కోర్సులలో శిక్షణ పొందుటకు పైన తెలిపిన అర్హత కలిగిన అభ్యర్ధులు https:apsccorporation.ap.gov.in/training/skill-program వెబ్ పోర్టల్ నందు ది.06-09 -2026 లోపుగా నమోదు చేసుకునుటకు అవకాశము కల్పించడమైనది కోరడమైనదని తెలిపారు. పైన తెలిపిన విషయములు సందేహాలు ఉన్నచో పూర్తివివరములు కొరకు యస్.సి.కార్పొరేషన్, ఏలూరు కార్యాలయం నేరుగాగాని లేదా ఈ కార్యాలయపు సిబ్బంది కె.సుగుణ రావు సెల్ ఫోను నెంబరు- 97013 55337, పి.రామాంజనేయ ప్రసాదు సెల్ ఫోను నెంబరు- 97058 63666, ఏ.రవికుమార్  సెల్ ఫోనునెంబరు – 9393527666 మరియు  పి.ప్రదీప్ కుమార్ సెల్ ఫోను నెంబరు 96402 94967 ద్వారా గాని సంప్రదించవలసినదిగా ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి ఒక ప్రకటనలో తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *