NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేతుల పరిశుభ్రతపై అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కల్లూరు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేతుల పరిశుభ్రతపై డాక్టర్.మోతిలాల్ నాయక్  అవగాహనా కల్పించినారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ  చేతులను సబ్బుతో శుభ్రంగా  కడుక్కుంటే  అంటూ వ్యాధులు రాకుండ నివారించగల ఒక సులభమైన మార్గమని  తెలిపారు.ముఖ్యంగా తినడానికి ముందు,మల,మూత్ర,విసర్జన చేసిన తరువాత,ముక్కు చీదిన తరువాత,ఏదేని తినుబండరాలను చేతిలో తీసుకొనేముందు మరియు తినే ముందు అనారోగ్యంగా ఉన్నవారికి సేవచేసే ముందు తరువాత,వంట వండే ముందు కూరగాయలు లేక ఏదేని వంట  సామాగ్రి  తాకే ముందు,  ,తుమ్మిన,దగ్గినా,ముక్కులను శుభ్రం చేసినా తరువాత, పిల్లల మలం శుభ్రం చేసిన తరువాత,పిల్లలు ఆటలాడిన తరువాత,ఎదిగిన పిల్లలైతే శానిటరీ ప్యాడ్స్ మార్చుకున్న తరువాత మరియు ప్యాడ్ పడవేసిన తరువాత,జంతువులు వాటి వ్యర్థాలు తాకిన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమములో మాస్ మీడియా అధికారి ప్రకాష్ రాజ్   ,సామజిక ఆరోగ్య అధికారి రంగస్వామి,క్షేత్ర స్తాయి పర్యవేక్షకులు సంపత్ , డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పద్మావతి ,   ,మరియు ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *