PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి నిరసన నిరాహార దీక్షలలో గిరిజన మహిళలు   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న నిరాహార దీక్షలో శనివారం స్థానిక జె.యం.తాండ గిరిజన మహిళలు పాల్గొన్నారు.పత్తికొండ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్  ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు  18 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 31 కేసులలో a1 ముద్దాయిగా 16 నెలలు జైలు జీవితం అనుభవించి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పై కక్షపూరితంగా అక్రమంగా నిర్బంధాలు విధిస్తూ, కేసులు పెట్టి, అరెస్టు, రిమాండు విధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో మచ్చలేని నాయకుడిగా వెలిగిన చంద్రబాబు నాయుడుపై ఏదో బురద చల్లాలని వైసీపీ ఎత్తుగడలు ఫలించవని అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్న టిడిపి భయపడేది లేదని, ప్రజా సంక్షేమం కోసం టిడిపి తిరిగి అధికారం చేపట్టబోతుందన్నారు. ఓటమి భయంతో వైసిపి టిడిపిపై కుట్రలు పన్నుతోందన్నారు. ఇలాంటి కుటిల యత్నాలను టిడిపి గట్టిగా ఎదుర్కొంటుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ బుద్ధి తెచ్చుకొని ప్రజా సంక్షేమానికి పాటుపడాలని, ఇలా ప్రతిపక్షాలపై రక్ష సాధింపు చర్యలు ఏమాత్రం సరికాదని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ, బాబు గారికి తోడుగా ఒక్క నియంతపై  పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలో భాగంగా18 వరోజు  కర్నూల్ రోడ్డు నందు ఉన్న అంభేథ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నారు అని,  వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.అనంతరం అక్కడ  నుండి నాలుగు స్తంభాల వరకు టిడిపి శ్రేణులు  ర్యాలీగా వచ్చి మహాత్మా గాంధీ గారు, పొట్టి శ్రీరాముల గారి విగ్రహాలకు పూలమాల వేసి రిలే నిరాహారదీక్షలో కూర్చున్న  గిరిజన మహిళలు (లంబాడీ)రీలే నిరాహారదీక్ష శిబిరం వద్ద  దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావం ప్రకటించారు. నిరాహార దీక్షలో  పాల్గొన్న పత్తికొండ నియోజకవర్గంతెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్య టీడీపీ నాయకులు రామానాయుడు అశోక్ కుమార్ తిరుపాలు సోమ్లా నాయక్ సంజప్ప శ్రీనివాసులు గౌడ్ సింగం శ్రీనివాసులు మనోహర్ చౌదరి లక్ష్మీనారాయణ చౌద రి వచ్చురప్ప తోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సొమ్ల నాయక్, రవీంద్రా నాయక్, చక్రీ నాయక్, క్రిష్ణ నాయక్, శీను నాయక్, నాగన్న నాయక్,వెంకటప్ప నాయక్, గిరిజన మహిళలకు కేఈ శ్యాం కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

About Author