NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాత్మ జ్యోతిరావు ఫూలేకి ఘన నివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప : బడుగు బలహీన సామాజిక వర్గాల ఆశాజ్యోతి బీసీల హక్కులకై ఉద్యమించిన సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతి సందర్భంగా టిడిపి బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రెడ్డయ్య యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వ హయాంలో బీసీల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని, కానీ ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఆ పథకాలు అన్ని రద్దుచేసి బీసీలు వెన్ను విరిచిందని తెలిపారు. పేరుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని, బిసి స్టడీ సర్కిల్స్ ను పూర్తిగా ఎత్తివేసి యువతను నిరుద్యోగులుగా మార్చారని, చేతివృత్తుల కులాలకు పనిముట్లు అందజేసే ఆదరణ పథకం రద్దు చేశారని, 72 మందిని పైగా హత మార్చారని, వందల సంఖ్యలో బిసిల మీద దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రకాలుగా బీసీలను మోసం చేసి సామాజిక సాధికార యాత్ర నిర్వహించే నైతికత వైసీపీకి లేదని విమర్శించారు. ఈ 2024 ఎన్నికలలో బీసీలందరూ ఐకమత్యంగా వైసిపిని గద్దిదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పెద్దబుద్ది వెంకట శివ ప్రసాద్, రవి యాదవ్, మళ్లీ, మహేష్, నాగేంద్ర, ఉత్తమరెడ్డి యాదవ్, శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య యాదవ్, విజయ్, ప్రసాద్, భాష, ఈశ్వరయ్య, ఒబులపతి తదితరులు పాల్గొన్నారు.

About Author