PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పునీత్ కు నివాళి.. ఉచితంగా ఆ సినిమాలు చూడొచ్చు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఘన నివాళి అర్పించింది. పునీత్ సినిమాలను, పీఆర్కే ప్రొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పునీత్ అభిమానులకు పునీత్ విజన్ ని, ఆయన కథల్లో ది బెస్ట్ ని అందిస్తాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆయన నటించి ఐదు సినిమాలు.. యువరత్న, కవలుదారి, లా, మాయా బజార్, ఫ్రెంచ్ బిరియాని సినిమాలను ఫిబ్రవరి 1​ నుంచి 28 వరకు స్ట్రీమింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది. వీటిని అమెజాన్ లో ఉచితంగా చూసే అవకాశం కల్పించింది.

          

About Author