టీఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి భేషరత్తుగా క్షమాపణ చెప్పాలి
1 min read– దురహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
– మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఆంధ్రా ప్రజలను శ్రీలంక రాక్షసులతో… దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగలతో పోల్చిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి దురంహకార పూరిత వ్యాఖ్యలతో… తెలంగాణ , రాయలసీమ ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉందని ఎస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. సముద్రంలో వృథాగా పోతున్న మిగులు జలాలను ఒడిసిపట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సీమ పొలాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, అటువంటి ఏపీ సీఎంపై అహంకారంతో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.