NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తౌక్టే తుఫాన్ తీవ్రరూపం: ఆరుగురు మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తౌక్టే తుఫాన్ దెబ్బకు క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌లు అత‌లాకుత‌లం అయ్యాయి. క‌ర్ణాక‌ట‌లో అతి భారీ వ‌ర్షాలు కురిసాయి. 6 జిల్లాల్లో తౌక్టే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాను కార‌ణంగా 4గురు మ‌రణించిన‌ట్టు క‌ర్ణాట‌క అధికారులు తెలిపారు. దాదాపు 73 గ్రామాల మీద తౌక్టే తుఫాను ప్రభావం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
కేర‌ళ‌లో ఇద్దరు మృతి: తౌక్టే తుఫాను కార‌ణంగా కేర‌ళ‌లో రెడ్ అల‌ర్ట్ ప్రక‌టించారు. తౌక్టే తుఫాను కేర‌ళ‌ను వ‌ణికించింది. తుఫాను కార‌ణంగా ఇద్దరు మ‌ర‌ణించారు. మల్లాపురం, వ‌య‌నాడ్, కాస‌ర్ గోడ్, కన్నూర్, కోళికోడ్ త‌దిత‌ర జిల్లా తుఫాను ప్రభావం అధికంగా ఉంది. తీర ప్రాంతాల్లో స‌ముద్రం ముందుకు రావ‌డంతో.. జ‌న‌జీవ‌నం స్తంభించింది. వంద‌లాది ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగి చాలా గ్రామాల్లో విద్యుత్ అంత‌రాయం క‌లిగింది.

About Author