హిందూ సమాజానికి ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలి
1 min readతమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
బే షరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్త ఉద్యమం
కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వహిందూ పరిషత్ శష్యబ్ధి ఉత్సవాలను ప్రారంభించడానికి వచ్చిన విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండేతో 6/9/23,మ : 12:30 గం.లకు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలో మెజారిటీ ప్రజలుగా ఉన్న హిందువులు పాటించే సనాతన ధర్మం కరోనా వైరస్ లాంటిదని దాన్ని పూర్తిగా నిర్మూలించాలని దుర్భాషలాడిన తమిళనాడు క్రీడామంత్రి స్టాలిన్ కుమారుడైన ఉదయనిది స్టాలిన్ ను వెంటనే మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా అందరి ఓట్లను స్వీకరించి మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు అన్ని మతాలను వర్గాలను సమాన దృష్టితో చూస్తానని ప్రమాణం చేసిన ఉదయనిది మారం ఈరోజున హిందూ మనోభావాలు దెబ్బతినేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గర్హనీయమైన విషయమని అన్నారు ఈయన ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అదే సభలో దేవాదాయ శాఖ మంత్రి కూడా పక్కనే ఉండి కూడా వారిని వారించకపోవడం దురదృష్టకరమైన విషయమని వాపోయారు. ఇక ఈ విషయమై ఉదయనిది స్టాలిన్ వెంటనే హిందూ సమాజానికి బే షరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం వేగంగా జరుగుతున్నదని 2024 సంక్రాంతి తర్వాత జనవరి 16 నుండి 24 తేదీల మధ్యలో గర్భాలయంలో మూలవిరాట్టు మహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా ఈ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు.విశ్వ హిందూ పరిషత్ షష్ట్యబ్ధి ఉత్సవాలలో భాగంగా దేశవ్యాప్తంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో “శౌర్య జాగరణ యాత్ర” పేరుతో యువకులలో దైవభక్తి దేశభక్తి పెంచడం, యువత వ్యసనాలకు దూరంగా ఉండటానికి ప్రోత్సహించడం, స్వతంత్ర సంగ్రామంలో తమ అసువులు బాసిన వీరులను తలుచుకొని వారితో ప్రేరణ పొందడం వంటి విషయాల కోసం ఈ యాత్ర నిర్వహించబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 80% గ్రామాలకు చేరుకునేలా ఈ యాత్ర నిర్వహణ ఉంటుందని తెలియజేశారు.విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 6 – 2023 న జరిగే కృష్ణాష్టమి నుండి 2024 లో వచ్చే కృష్ణాష్టమి వరకు సంవత్సరం పాటు షష్ఠప్తి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని సంస్థాగతంగా విస్తృతస్థాయిలో కార్యకర్తల జట్టును ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతాయనీ ప్రస్తుతం దేశంలో ఉన్న 76 వేల కమిటీలను లక్ష కమిటీలకు పెంచేలా యోజన చేయడం జరిగిందని, అలాగే 72 లక్షల మంది గా ఉన్న కార్యకర్తలను కోటి మంది కార్యకర్తలుగా పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,500 సేవా ప్రకల్పాలను ఎనిమిది వేల సేవా ప్రకాల్పాలు గా పెంచాలని, దేశంలో ఉన్న 400 సేవా జిల్లాలను రెట్టింపు చేయాలని సంకల్పం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 40 సంవత్సరాలుగా 27 సేవా కార్యాలు, ఎస్సీ ఎస్టీలు నివసించే చోట నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలలో 955 మంది విద్యార్థులు, వసతి గృహాల్లో 55 మంది విద్యార్థులకు విశ్వహిందూ పరిషత్తు సేవలను అందిస్తోందని తెలియజేశారు. వీటి సంఖ్యను మరింత పెంచే ప్రయత్నంలో లక్ష్యంగా తీసుకుంటున్నామని తెలియజేశారు.ఆలయాల కమిటీలలో ప్రభుత్వం యొక్క జోక్యం ఎక్కువగా ఉన్నదని ఆర్థిక కుంభకోణాల్లో ఉన్న వారిని, నేల చరిత్ర కలిగిన వారిని, అవినీతి ఆరోపణలు చేయబడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాలకమండలి సభ్యులుగా నియమించరాదని డిమాండ్ చేస్తున్నామన్నారు.దేశవ్యాప్తంగా సాధుసంతులు ధర్మ యాత్రల పేరుతో దీపావళి ముందు కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. హిందూ జాగరణ , సమరస భావన, కుటుంబం పట్ల బాధ్యత, మతమార్పిడుల పట్ల జాగ్రత్త వహించడం వంటి వాటికోసం ధర్మాచార్యులు యాత్రలు నిర్వహిస్తారన్నారు.రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయా దేవాలయాల నిర్వహణను పూర్తిగా హిందూ సమాజానికి అప్పగించాలని అప్పటివరకు ఆ ఆలయాల ఆదాయాలను హిందూ ధర్మ ప్రచారం కోసం మాత్రమే వినియోగించాలని దేవాలయాలలో ఉద్యోగులను వ్యాపార సముదాయాలను హిందువులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్న మతమార్పిడులను అడ్డుకోవడానికి యాంటి కన్వర్షన్ బిల్లు తేవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి, కార్యదర్శి కాకర్ల రాముడు,సహకార్యదర్శి ప్రాణేష్,బజరంగ్ దళ్ కన్వీనర్ విశ్వహిందూ పరిషత్తు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.