NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ ఉర్దూ ఎంపీపీఎస్​  పాఠశాల ఎస్​ఎంసి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

1 min read

పత్తికొండ ఉర్దూ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా హఫీజ్ షేక్ మహమ్మద్ గౌస్.

వైస్ చైర్మన్‌గా ఎస్. షకీలా ఏకగ్రీవ ఎన్నిక

న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ పట్టణంలోని ముస్లిం స్ట్రీట్‌లో వేలిసిన ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో బుధవారం నాడు పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్​ఎంసి) ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో, ఏకగ్రీవంగా నిర్వహించబడింది.విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. ఇక్బాల్ హుస్సేన్, ఉపాధ్యాయులు మహబూబ్ బాషా ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాఠశాల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ ఎన్నికల్లో పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులందరూ సమష్టిగా నిర్ణయించుకుని ఎస్​ఎంసి నూతన చైర్మన్‌గా హాఫిజ్ ఎస్. మహమ్మద్ గౌస్ ను, వైస్ చైర్మన్‌గా ఎస్. షకీలా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీ లేకుండా అందరి ఆమోదంతో నూతన కమిటీ ఎన్నిక కావడంపై ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన చైర్మన్ హాఫిజ్ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ— పాఠశాలలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య , ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పాఠశాలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు, విద్యార్థుల  ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో కృషి చేస్తామని చెప్పారు.

About Author