ప్రభుత్వ కార్యాలయాలు ఆకస్మిక తనిఖీలు
1 min read– జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సాముల్
పల్లెవెలుగు, వెబ్ ప్యాపిలి: ప్యాపిలి పట్టణంలోని 1వ సచివాలయం, అంగన్వాడి కేంద్రం, బాలికల పాఠశాలను మంగ్లవారం నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సాముల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ముందుగా ఎంఆర్ఓ కార్యలయంలో ఆయన జగన్న గృహనిర్మాణం పైనా హౌసింగ్ డిఇ ,ఎఇలను అడిగితెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ఒకటవ సచివాలయంను ఆయన పర్యటించి సచివాలయం ఉద్యోగులతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందిస్తు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు,ఉద్యోగుల విధినిర్వహకంలో సమయపాలన పాటించాలని ,రికార్డుల ను పరిశిలించి హజర్ నమోదు ను తానికిలు నిర్వహించారు. అనంతరం ప్రక్కనే వున్న అంగన్వాడీ కేంద్ర ను తానికిలు చేస్తు పిల్లలకు ,గర్భవతలకు పౌష్టికాహారం పంపిణీ చేయాలని, పాలు ,చిక్కీ ,బ్యాడ్లను నాన్యతను పరిశిలించి పిల్లల హాజరు శాతం పట్టాకను తానికిలు నిర్వహించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బాలికల పాఠశాలను సందర్శించి నాడు నేడు పనులపైన ఎంఇఓ శ్రీనివాసులను , ప్రధాన ఉపాధ్యాయరాలుని అడిగితెలుసుకున్నారు,అనంతరం తరగతి గదిలో వెళ్లి విద్యార్థీనిలతో విద్యబోదనలపైన పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యా బోధన పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చదువు పైన బాలికలకు దృష్టి వుంచేల చూడలాని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో వెంకటరెడ్డి ,ఎంఆర్ఓ ఎం.శివరాముడు ,ఎంపిడిఓ పాజుల్ రహిమాన్ ,ఇఓఆర్డీ బాలకృష్ణ ,పిఆర్ఏఇ ప్రభకర్ రెడ్డి , ఆర్ డబ్ల్యు ఎఇ రవి ,ఇఓ శివకుమార్ గౌడ్ ,సచివాలయం ఉద్యోగులు ,తదితరులు అధికారులు, గ్రామ వాలెంటర్లు పాల్గొన్నారు.