PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన పట్ల హర్షం వ్యక్తం

1 min read

– తెలంగాణాలో బిజెపి అదికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం

– బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని చెప్పి హామీ

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  కేంద్ర పార్టీ ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి . ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మండల భారతీయ జనతా పార్టీ,  సీనియర్ నాయకులు జాతీయ కౌన్సిల్ మెంబర్ శ్రీ అమర్ కుమార్ దీక్షిత్  స్వగృహంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల సూర్యాపేట సభలో  హోంశాఖ మాత్యులు శ్రీ అమిత్ షా ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకొస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం పట్ల    కేంద్ర నాయకత్వానికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకి, ప్రధానమంత్రి మోడీకి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కి    సంపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కేవలం బీసీలను ఓటు బ్యాంకు యంత్రాలుగా    ఎమ్మెల్యేల అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తూ వారిని ఓటు బ్యాంకు రాజకీయాలుగా    పబ్బం గడుపుకుంటున్నారు గడుపుకుంటున్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అత్యధికంగా 43 సీట్లను బీసీలకు కేటాయించడం జరిగింది. నిజమైన చిత్తశుద్ధిని  బిజెపి మాత్రమే ప్రకటించింది. అధికారంలోకొస్తే బీసీ అభ్యర్థిని  ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని చెప్పి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నియోజకవర్గంలో ప్రజలకు, విద్యావంతులకు, యువకులకు, మహిళలకు అన్ని వర్గాల కులాల వారికి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాం.ఈసారి మక్తల్ నియోజకవర్గ ప్రజలకు బిజెపి ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.  అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కేవలం ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నది, ఇంకొక ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ  అమలకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ  వంచనకు గురి చేస్తున్నారు. కాబట్టి విజ్ఞులైన ఓటర్ మహాశయులకు మనం అనేకసార్లు కోరుకునేది ఏమంటే ఈసారి కచ్చితంగా కమలం పువ్వుకు ఓటేసి ఇటు నియోజకవర్గంలో  మరియు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను ఎన్నుకొని అభివృద్ధి పట్ల ప్రయాణింప చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నవారు  జాతీయ కౌన్సిల్ సభ్యులుశ్రీ అమర్ కుమార్ దీక్షిత్ , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సోమశేఖర్ గౌడ్ , జిల్లా నాయకులు మజ్జిగ సురేష్ గారు, మండల అధ్యక్షులు శ్రీనివాసులు   ప్రధాన కార్యదర్శులు నలే నరసప్ప దండు రాఘవేంద్ర, నారాయణ బట్, ఎంపిటిసి కొంకల వెంకటేష్, మాజీ సర్పంచ్ డీకే కృష్ణప్ప, ఉప సర్పంచ్ తిమ్మప్ప, శంకరయ్య శెట్టి, సీనియర్ నాయకులు శంకరప్ప, ఆంజనేయులు ఆంజనేయులు, కాండ్రయ్య తిప్పన, జంషెడ్ నర్సింగప్ప, మోహన్ కుమార్, నాగప్ప, శక్తి సింగ్,,, బసవలింగ, తాయప్ప, రాయచూరు శరణం, శివకుమార్ ,తదితరులు పాల్గొన్నారు.

About Author