యూపీ రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్! ఇద్దరు రైతులు మృతి
1 min readపల్లెవెలుగువెబ్, ఢిల్లీ: ఉత్తర్రపదేశలోని లకింపూర్ఖేరి జిల్లాలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతోన్న రైతాంగ శిబిరంపైకి కేంద్రహోంశాఖ మంత్రి అజయ్‌మిశ్రా వాహన కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. మరికొందరు రైతులు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన రైతులు మంత్రి కాన్వాయ్‌లోని మూడువాహనాలను దగ్ధం చేశారు. లకింపూర్ జిల్లాలో ఆదివారం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా, యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్మౌర్యలు వచ్చారు. మంత్రుల పర్యటనను తెలుసుకున్న ఆందోళన రైతాలు వారి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో మంత్రుల కాన్వాయ్ రైతుల మీదుకు దూసుకెళ్లడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.