NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘తిరుమల గిరి ఫేస్ – 6’ అనధికార లేఅవుట్

1 min read

ప్లాట్లు కొని మోసపోవద్దని కమిషనర్ సూచన

కర్నూలు, న్యూస్​ నేడు:  శనివారం నగరంలోని లక్ష్మిపురం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 696 (పి) నందు‘తిరుమల గిరి ఫేస్ – 6’ పేరుతో ఏర్పాటు చేసిన లే‌అవుట్ అనధికారమని, అందులో ప్లాట్లు కొని మోసపోవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్‌ఆర్‌యస్ – 2020 పథకం ద్వారా సైతం రియల్ ఎస్టేట్ యజమానులు దరఖాస్తు చేసుకోలేదని, కాబట్టి అందులో రహదారులు, డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పించడం జరగదని స్పష్టం చేశారు. కావున నగర ప్రజలు గమనించి, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయరాదని కమిషనర్ సూచించారు.

About Author