NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తుమ్మలూరు’లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

1 min read

విగ్రహ దాత మాజీ ఎమ్మెల్యే ఐజయ్య..

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా పాములపాడుమండల పరిధిలోని తుమ్మలూరు గ్రామంలో శనివారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్  అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.విగ్రహ ధాత నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఎక్కలదేవి ఐజయ్య..వై చంద్రమౌళి, ఐ ఆర్ ఎస్ అధికారి వేల్పుల ఆనంద్ కుమార్, నందికొట్కూరు టిడిపి మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాదులు వాడాల త్యాగరాజు,హరిఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సలోమి విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు.ముందుగా గ్రామంలో ఘన స్వాగతం పలికారు.తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ప్రతి వర్గానికి న్యాయం చేకూరుతుందని అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.విద్య,ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని అన్నారు.అంబేద్కర్ విగ్రహాన్ని దాతగా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఐజయ్యకు వక్తలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి రామలింగేశ్వర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గోవింద్, సర్పంచ్ వనమాల ప్రసాద్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

About Author